రైతులను నష్టపోనివ్వం | - | Sakshi
Sakshi News home page

రైతులను నష్టపోనివ్వం

May 24 2026 12:57 AM | Updated on May 24 2026 12:57 AM

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాల: భూములు కోల్పోతున్న రైతులను నష్టపోనివ్వబోమని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. జాతీయ రహదారి ఎన్‌హెచ్‌–63 విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులకు కలెక్టరేట్‌లో హియరింగ్‌ చేపట్టారు. వారు తమ సమస్యలను విన్నవించగా.. రైతుల అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నామని కలెక్టర్‌ తెలిపారు. అనంతరం గుమ్లాపూర్‌, మోహన్‌రావు, మేడిపల్లి గ్రామాలకు చెందిన 323 మంది అవార్డీల కేసులను విచారణ చేశారు. కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జివాకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement