వడదెబ్బ..11 మంది మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బ..11 మంది మృతి

May 24 2026 12:57 AM | Updated on May 24 2026 12:57 AM

కమల(ఫైల్‌)

గోదావరిఖని/పెద్దపల్లి/పెద్దపల్లి రూరల్‌/కొత్తపల్లి/ఓదెల/రామగిరి/సిరిసిల్లటౌన్‌/యైటింక్లయిన్‌కాలనీ: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో శనివారం వడదెబ్బతో 11 మంది మృతిచెందా రు. పెద్దపల్లిలోని ముత్యాల పోచమ్మవాడకు చెందిన దినసరి కూలీ ఫయాజ్‌ (52), ఇదే జిల్లాలోని సుల్తానాబాద్‌ పట్టణం సుభాష్‌నగర్‌కు చెందిన న్యాతరి మొండయ్య (76), ఓదెల మండలం కొలనూర్‌ గ్రామానికి చెందిన గీట్ల మధుసూదన్‌రెడ్డి (53), రామగిరి మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన బుడిగె కమల(65), యైటింక్లయిన్‌కాలనీ వెంకట్రావుపల్లి కేకేనగర్‌కు చెందిన కనుకుట్ల ఐలమ్మ(73), గోదావరిఖని పరుశరాంనగర్‌కు చెందిన ఎం.శంకర్‌(45), గోదావరిఖనిలోని మధుప్రియ హోటల్‌లో పనిచేస్తున్న వెల్దండి మహేశ్‌(52), ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికురాలు గజనవేని మల్లమ్మ(56), రాజన్న సిరిసిల్ల జిల్లా శాంతినగర్‌కు చెందిన మంచాల నరసయ్య(75), శాంతినగర్‌కు చెందిన మిట్టపల్లి శంకర్‌(48), కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లికి చెందిన ఆటో డ్రైవర్‌ దామెరశెట్టి మల్లేశం (52) వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement