మరో నాలుగు రోజులు వడగాలులే | - | Sakshi
Sakshi News home page

మరో నాలుగు రోజులు వడగాలులే

May 24 2026 12:57 AM | Updated on May 24 2026 12:57 AM

● ఉమ్మడి జిల్లాలో రెడ్‌ అలర్ట్‌ ● జాగ్రత్తలు తప్పనిసరంటున్న వైద్యులు

జిల్లాల వారీగా నమోదైన ఉష్ణోగ్రతలు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా రెడ్‌ జోన్‌లోకి చేరగా శనివారం అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. కరీంనగర్‌ జిల్లాలో రెండు, పెద్దపల్లిలో ఏడు మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవగా వడగాలుల ప్రభావం అధికంగా ఉందని ప్రణాళిక విభాగం అధికారులు ప్రకటించారు. కాగా ఉదయం 8గంటలకే వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేయగా సాయంత్రం 6దాటినా దారులపై వడగాలులే. మరో నాలుగు రోజుల పాటు వడగాలులుంటాయని వాతావరణ శాఖ ప్రకటించగా ప్రజలంతా జాగ్రత్త ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే కాటన్‌ దుస్తులు ధరించాలని, వీలైతే పనులను వాయిదా వేసుకోవడమే ఉత్తమమని స్పష్టం చేస్తున్నారు. కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఆందోళనకరస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

కరీంనగర్‌(గంగాధర) 46.4

పెద్దపల్లి (ఎలిగేడు) 46.4

జగిత్యాల (కోరుట్ల, అయిలాపూర్‌) 46.4

రాజన్న సిరిసిల్ల (పెద్దూరు) 46.4

Advertisement
 
Advertisement
Advertisement