కేవీ స్థలంపై రాద్దాంతం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

కేవీ స్థలంపై రాద్దాంతం చేయొద్దు

May 24 2026 12:57 AM | Updated on May 24 2026 12:57 AM

జగిత్యాల: కేంద్రీయ విద్యాలయం స్థలంపై అనవసరపు రాద్ధాంతం చేయొద్దని, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పలుచోట్ల పరిశీలించి విద్యార్థులకు అనుకూలమైన చోట కేటాయిస్తామని డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య అన్నారు. మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి దీనిపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈన కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. శ్రావణి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయని పేర్కొన్నారు. సుందరీకరణలో ఖర్జూర మొక్కలు నాటితే ఈతపళ్లు కాస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లో బిజినెస్‌ చేసుకుంటూ మెరుపుతీగలా వచ్చి మా ట్లాడితే ప్రజలు నమ్మబోరని పేర్కొన్నారు. పసుపుబోర్డు అని చెప్పి ఎంపీ అర్వింద్‌ ప్రజలను మోసం చేశారని, స్పైస్‌ బోర్డుతో ప్రజలకు లాభం లేదన్నారు. జగిత్యాల అభివృద్ధికి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ నిరంతరం కృషి చేస్తున్నారని, శ్రావణి కుటుంబ చరిత్ర అందరికీ తెలుసునన్నారు. సమావేశంలో చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి, బండ శంకర్‌, గిరి నాగభూషణం, అడువాల జ్యోతి, గట్టు సతీశ్‌, కొత్తమోహన్‌, రాజేశ్‌, చంద్రకళ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement