ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం రంగురంగుల పూలతో స్వామివారిని అలంకరించారు. అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆలయ ప్రాంగణంలో లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఉచిత శిక్షణ
జగిత్యాల: బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఫౌండేషన్ వారి సహకారంతో ఏఐ లైఫ్ స్కిల్స్‌పై నాలుగు రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సునీత తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 26లోపు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్‌లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని, ఈనెల 27 నుంచి 30 వరకు శిక్షణ నిర్వహించడం జరుగుతుందన్నారు. మిగతా వివరాలకు 0878–2268686 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
చల్‌గల్ మార్కెట్‌లో రైతుల ఆందోళన
జగిత్యాలరూరల్: జిల్లా కేంద్రంలోని చల్‌గల్ వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం రైతులు ఆందోళన చేశారు. వరిధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతోందని, అలాగే తూకం వేసేందుకు హమాలీలు ఒక్కో రైతు వద్ద రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. దీంతో పాటు, 43 కిలోలతో తూకం వేస్తున్నారని, దీంతో రైతులకు ఎంతో నష్టం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పనులు నాణ్యతగా చేపట్టాలి
జగిత్యాల: అభివృద్ధి పనులు వేగవంతంగా చే స్తూ నాణ్యతగా నిర్మించాలని ఎమ్మెల్యే సంజ య్‌కుమార్ అన్నారు. 42వ వార్డులో రోటరి క్ల బ్ పార్క్ పక్కన నిర్మించిన బీటీరోడ్డును శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. కొన్నేళ్లుగా ఈ రోడ్డుతో ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారని, బీటీ రోడ్డు మంజూరు కావడంతో ఇ బ్బందులు తొలగాయన్నారు. మున్సిపల్ చైర్మ న్ సమిండ్ల వాణి, నందయ్య, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, బండ శంకర్, సత్యప్రణవ్, నా గరాణి, నాగభూషణం, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ విధానంతో తిప్పలుపడుతున్న రైతులు
జగిత్యాలరూరల్: కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో రైతులకు బాధలు తప్పడం లేదని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట, సారంగాపూర్ మండలం అర్పపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలులో జాప్యంతో రైతులు ఎర్రటి ఎండలో నానా కష్టాలు పడుతున్నారన్నారు. కొనుగోలు సెంటర్లలో గన్నీ బ్యాగులు, లారీల కొరతతో కొనుగోళ్లు జరగడం లేదన్నారు. నాయకులు ఆనందరావు, సత్యంరావు, తిరుపతి, ప్రసాద్, రవీందర్‌రావు, రాజన్న, గంగారాం, రవీందర్‌రెడ్డి, మహేందర్ పాల్గొన్నారు.
బాంబు స్క్వాడ్ బృందం తనిఖీ
జగిత్యాలక్రైం: సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో శుక్రవారం బాంబు స్క్వాడ్ బృందం విస్తృత తనిఖీలు చేపట్టారు. గ్రామంలోని బస్టాండ్, అంగడి బజార్ పరిసరాలు, దుకాణాలు, ఇతర ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. బాంబు డిటెక్షన్ టీంతో గంజాయి వంటి నిషేధిత మత్తు పదార్థాల గుర్తింపును నైపుణ్యం కలిగిన బాంబుస్క్వాడ్ బృందంతో తనిఖీలు చేశారు.


