జగిత్యాలటౌన్: కేంద్రీయ విద్యాలయం విషయంలో విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు తగదని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి భోగ శ్రావణి అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో భారీ అవినీతి జరిగిందని, ఎమ్మెల్యే హయాంలో జరిగిన అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రీయ విద్యాలయానికి చల్‌గల్ వ్యవసాయ క్షేత్రంలో 5ఎకరాలు కేటాయించాలని కోరారు. జగిత్యాల మున్సిపాలిటీకి కేంద్రం మంజూరు చేసిన రూ.62కోట్ల నిధుల పనుల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కౌన్సిలర్ నిమ్మల నాగరాజు, నాయకులు ఆముద రాజు, మ్యాదరి అశోక్, మహిళా మోర్చా నాయకురాలు దూరిశెట్టి మమత, చెన్నాడి మధురిమ, గడ్డల లక్ష్మి, సింగం పద్మ పాల్గొన్నారు.
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని భోగ శ్రావణి అన్నారు. శుక్రవారం సారంగాపూర్ మండలం పోచంపేటలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రాల్లో ధాన్యం పోసి నెలలు గడుస్తున్నా కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. సర్పంచ్ జగదీశ్, నాయకులు నాగేందర్, సుజాత, నరేశ్ పాల్గొన్నారు.


