శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతర గస్తీ | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతర గస్తీ

May 23 2026 1:58 AM | Updated on May 23 2026 1:58 AM

● ఎస్పీ అశోక్‌కుమార్‌

జగిత్యాలక్రైం: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు రాత్రి వేళల్లో నిఘా మరింత బలోపేతం చేయడం జరిగిందని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. గురువారం రాత్రి జిల్లాలోని పెట్రోలింగ్‌ వ్యవస్థను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అసాంఘిక కార్యకాలపాలు, చట్ట వ్యతిరేక చర్యలు, దొంగతనాలను అరికట్టేందుకు బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్‌ వాహనాలతో నిరంత గస్తీ నిర్వహించడంతో పాటు నైట్‌ బీట్‌ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. రాత్రి సమయంలో సమర్థవంతమైన పెట్రోలింగ్‌ నిర్వహించడం ద్వారా ప్రజల్లో భద్రత భావం పెంపొందించడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమన్నారు. సమయానుకూలంగా స్పందిస్తూ నేరాలకు ముందుగానే అడ్డుకట్ట వేయవచ్చాన్నారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జీవించేందుకు అన్నిరకాల భద్రత చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement