మహిళల విద్యాభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

మహిళల విద్యాభివృద్ధికి కృషి

May 23 2026 1:58 AM | Updated on May 23 2026 1:58 AM

జగిత్యాల: మహిళల విద్యాభివృద్ధికి భాగ్యరెడ్డివర్మ ఎనలేని కృషి చేశారని అదనపు కలెక్టర్‌ లత అన్నారు. భాగ్యరెడ్డివర్మ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. డీఎస్‌సీడీవో రాజ్‌కుమార్‌, సునీత పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి

పెగడపల్లి(ధర్మపురి): ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి వారంలోపు పూర్తయ్యేలా చూడాలని అడిషనల్‌ కలెక్టర్‌ బీఎస్‌ లత పేర్కొన్నారు. మండలంలోని బతికపల్లిలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. కేంద్రంలోని నిల్వలను పరిశీలించి సేకరించిన ధాన్యం వివరాలు తెలుసుకున్నారు. తేమశాతం వచ్చిన ధాన్యం కుప్పలను వెంటనే తూకం వేసి మిల్లర్లకు చేరవేయాలని సూచించారు. ట్యాబ్‌లో నమోదు చేసిన మరుసటి రోజునే రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నట్లు తెలిపారు. లారీల కొరతతో ధాన్యం బస్తాల సరఫరాలో జాప్యం జరుగుతుందని, లారీల కొరత లేకుండా చూడాలని అదనపు కలెక్టర్‌ను నిర్వాహకులు కోరారు. డీసీఎస్‌వో జితేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ సయ్యద్‌ నిజామొద్దీన్‌, ఆర్‌ఐలు శ్రీనివాస్‌, జమున, ఏపీఎం రవివర్మ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement