మెట్‌పల్లి వార్షిక బడ్జెట్‌ రూ.40.54కోట్లు | - | Sakshi
Sakshi News home page

మెట్‌పల్లి వార్షిక బడ్జెట్‌ రూ.40.54కోట్లు

Mar 14 2026 7:54 AM | Updated on Mar 14 2026 7:54 AM

ఆమోదించిన కౌన్సిల్‌

మెట్‌పల్లి(కోరుట్ల): మెట్‌పల్లి మున్సిపల్‌లో 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను రూపొందించిన వార్షిక బడ్జెట్‌కు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. మున్సిపల్‌ సమావేశ మందిరంలో శుక్రవారం చైర్మన్‌ మైలారపు లింబాద్రి అధ్యక్షతన బడ్జెట్‌ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రూ.40.58కోట్ల అంచనా ఆదాయం, రూ.40.54 కోట్ల అంచనా వ్యయం, రూ.4.36లక్షల మిగులుతో రూపొందించిన బడ్జెట్‌ను సభ్యుల ముందు ఉంచగా, వారు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఇందులో వేతనాలకు రూ.4.80కోట్లు, పారిశుధ్య నిర్వహణకు రూ.1.50 కోట్లు, గ్రీన్‌ బడ్జెట్‌కు రూ.1.15 కోట్లు, విద్యుత్‌ చార్జీలకు రూ.1.93 కోట్లు కేటాయించారు. అనంతరం పలువురు సభ్యులు వార్డుల్లో నెలకొన్న సమస్యలను చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లగా, వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సమావేశానికి ముందు బీజేపీ సభ్యులు స్థానిక చెన్నకేశవనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఎంపీ అర్వింద్‌ చిత్రపటాలతో కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం వాటిని సమావేశ మంది రంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ ఓంకార్‌ నవీన్‌, కమిషనర్‌ స్పందన, డీఈఈ నాగేశ్వర్‌రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement