మెట్‌పల్లిరూరల్: సమీకృత సాగు విధానంతో రైతులు లాభాలు గడించవచ్చని డీఆర్‌డీఏ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ నారాయణ అన్నారు. మెట్‌పల్లి మండలం మెట్లచిట్టాపూర్, విట్టంపేట గ్రామాల్లో సెర్ప్, వాస న్ ఎన్‌జీవో ఆధ్వర్యంలో వ్యవసాయ, అనుబంధ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు వ్యవసాయ విధానంపై బుధవారం అవగాహన కల్పించారు. పశుపోషణ, సాగు, చేపలు, పౌల్ట్రీ తదితర ఉత్పాదకతలను పెంచడమే దీని లక్ష్యమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అరుణ, ఏపీఎంలు అహ్మద్ హుస్సేన్, అశోక్, వాసన్ ఎన్‌జీవో డైరెక్టర్ భాగ్యలక్ష్మి, ఉపసర్పంచ్ నారాయణ, సమాఖ్య అధ్యక్షురాలు లత పాల్గొన్నారు.


