జగిత్యాల/జగిత్యాలటౌన్: ప్రజలను మోసం చేయడానికే ప్రభుత్వం మరో ప్లాన్‌తో ముందుకొచ్చిందని, 99 రోజుల యాక్షన్ ప్లాన్ పచ్చి మోసమని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లాకేంద్రంలో మాట్లాడుతూ ప్రగతి ప్రణాళిక పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. జెండా, ఎజెండా లేకుండా ఇష్టారీతిన పాలన నడుస్తోందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజాపాలనకు జిల్లాలోనే రెండు లక్షల దరఖాస్తులు వస్తే ఏమయ్యాయని ప్రశ్నించారు. రాజీవ్ యువ వికాస్ పేరిట 4 లక్షల మంది యువత దరఖాస్తు చేసుకుంటే నయా రూపాయి ఇవ్వలేదన్నారు. 99 డేస్ ప్రగతా... ప్రణాళికణా స్పస్టం చేయాలన్నారు. రైతు భరోసా ఎక్కడ అని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా అంటాడని, పక్కన మాత్రం కాంగ్రెస్ కండువాలు కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు, కౌన్సిలర్లు దేవేందర్, హరీశ్, ఆనందరావు, గంగాధర్, ప్రవీణ్, కమలాకర్ పాల్గొన్నారు.


