తడి, పొడి చెత్త వేరుచేయాలి | - | Sakshi
Sakshi News home page

తడి, పొడి చెత్త వేరుచేయాలి

Mar 11 2026 7:29 AM | Updated on Mar 11 2026 7:29 AM

● జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి

జగిత్యాల: జిల్లాకేంద్రంలో పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని, తడి, పొడి చెత్త వేరుచేసి ఇవ్వాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంగళవారం డంపింగ్‌యార్డు, డ్రైనేజీలను పరిశీలించారు. నాలాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, గంజ్‌నాలాలో సిల్ట్‌ను పూర్తి గా తొలగించాలని సిబ్బందికి సూచించారు. డంపింగ్‌యార్డులో తరుచూ మంటలు అంటుకోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు స్వప్న, శానిటరి ఇన్‌స్పెక్టర్‌ లత, రాము, ఈఈ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement