నాలుగెకరాల్లో కర్బూజ సాగు చేశా. సీంఎంఆర్ పద్ధతిలో మట్టిని పంటపై స్ప్రేచేశా. ఇప్పటికే ఏడెనిమిది సార్లు రసాయన మందులు పిచికారీ చేసినా ఫలితం కనబడలేదు. పంట నష్టం తీవ్రంగా జరిగింది. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా లేదు.
– బండారి వెంకటేశ్, పెంబట్ల, సారంగాపూర్
మామిడికి పెద్ద దెబ్బ
ఈసారి మామిడిని పురుగులు దెబ్బతీశాయి. పూత దశ నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు మందులు కొట్టినా. కాయ నిలబడితేనే రైతుకు లాభం. ఉష్ణోగ్రతలు, పురుగుల ఉధృతి పెరుగుతున్న కొద్ది పిందెలు ఏమేరకు ఆగుతుందో అర్థం కావడం లేదు.
– కిష్టంపేట రమేష్ రెడ్డి, శ్రీరాముల పల్లె, గొల్లపల్లి(మం)


