ఆగని ఆ‍క్రమణలు.. తరచూ ప్రమాదాలు | - | Sakshi
Sakshi News home page

ఆగని ఆ‍క్రమణలు.. తరచూ ప్రమాదాలు

Mar 10 2026 12:47 PM | Updated on Mar 10 2026 12:47 PM

● రహదారులపైనే సైన్‌బోర్డులు ● ఇరుకై న రోడ్లతో తిప్పలు ● జిల్లాకేంద్రంలో నిత్యం ట్రాఫిక్‌జామ్‌ ● పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు

జగిత్యాల: జిల్లా కేంద్రం.. శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఆస్పత్రులు, సూపర్‌మార్కె ట్లు, కిరాణంషాపులు, స్కానింగ్‌ సెంటర్లు, వాణిజ్య వ్యాపారాలు అత్యధికంగా వెలుస్తున్నాయి. కొత్తబస్టాండ్‌ నుంచి టవర్‌సర్కిల్‌ వరకు.. తహసీల్‌ చౌరస్తా నుంచి జంబిగద్దె వరకు.. జంబిగద్దె, పాతబస్టాండ్‌ ఏరియాల్లో అత్యధికంగా వాణిజ్య సముదాయాలు వెలిశాయి. సదరు షాపుల యజమానులు దుకాణాల ముందు మామూలు బోర్డులతోపాటు రోడ్డు ఆక్రమించి పెద్దపెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పొద్దంగా రోడ్డుపై పెట్టి రాత్రిపూట షాపుల్లో పెట్టుకుని వెళ్తున్నారు. మరికొందరు వాటిని తొలగించకుండా పకడ్బందీగా పాతి మరీ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. కొందరు రేడియం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రాత్రిపూట అవి రిఫ్లెక్షన్స్‌తో ప్రమాదాలు జరుగుతున్నాయి.

టౌన్‌ ప్లానింగ్‌ ఎక్కడ?

రోడ్లను ఆనుకుని బోర్డులను ఏర్పాటు చేస్తున్నా టౌన్‌ప్లానింగ్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే వెంటనే కూల్చివస్తారు గానీ బోర్డులు ఏర్పాటు చేస్తే మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఎక్కడపడితే అక్కడ బోర్డులమయంగా మారింది. ఫ్లెక్సీల కారణంగా వాహనాల పార్కింగ్‌ ఏర్పాటు చేసుకునేందుకూ ఇబ్బందిగా మారింది.

పార్కింగ్‌ ఇబ్బంది

రోడ్లను ఆనుకుని బోర్డులు ఏర్పా టు చేయడంతో ఆస్పత్రులకు, ఇతర పనులకు వ చ్చే వాహనదారులకు వాహనాలను ఎక్కడ పార్కింగ్‌ చేయాలో తెలి యక ఇబ్బందులకు గురవుతున్నా రు. కారు, జీపు, ఆటోలు వెళ్తే ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ఆస్పత్రుల ఏరియాల్లో వారి ఆస్పత్రికి సంబంధించిన నేమ్‌ బోర్డులను ఎక్కడబడితే అక్కడ పెడుతున్నారు. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

స్థలాలు కబ్జా

రోడ్లను దర్జాగా కబ్జా చేస్తున్నారు. షాపుల ముందు కాకుండా రోడ్డుపై వరకు వచ్చి బోర్డులను పెట్టడంతోపాటు రేకులషెడ్లను కూడా నిర్మిస్తున్నారు. వాస్తవానికి షెటర్లు, బిల్డింగ్‌ ఉన్న వరకే బోర్డులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ.. బిల్డింగ్‌ల ముందుభాగం వరకు రేకులషెడ్లు వేయడం, ఆపై సైన్‌బోర్డులను పెడుతున్నారు. అధికారులు స్పందించి ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఈ చిత్రంల జిల్లాకేంద్రంలోని జంబిగద్దె ప్రాంతంలో ప్రధాన రోడ్డు. ఇక్కడ అనేకం ఆస్పత్రులు, వాణిజ్య వ్యాపారాలు ఉన్నాయి. ఆస్పత్రులకు సంబంధించిన సైన్‌బోర్డులు, ఫ్లెక్సీలు రోడ్డుపైనే ఏర్పాటు చేయడం.. ఆస్పత్రులకు పార్కింగ్‌ లేకపోవడంతో వాహనాలను రోడ్లపైనే పార్కింగ్‌ చేస్తుండడం ఇబ్బందిగా మారింది. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి సైన్‌బోర్డులను తొలగించి ట్రాఫిక్‌ సమస్య లేకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని

పాతబస్టాండ్‌. ఈ బస్టాండ్‌ నుంచే ధర్మపురి వైపు బస్సలు వెళ్తాయి. నిత్యం వందలాది మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్లను ఆక్రమించుకుని దర్జాగా షాపులు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంమీదుగా వాహనాలు వెళ్లాలంటేనే చాలా ఇబ్బందిగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement