● సైబర్ క్రైం డీఎస్పీ వెంకటరమణ
జగిత్యాలక్రైం: సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైం డీఎస్పీ వెంకటరమణ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మహిళా నర్సింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై సోమవారం అవగాహన కల్పించారు. మహిళలు, విద్యార్థినులు వివి ధ రకాల మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నా రు. సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపడం, వేధించడం, బెదిరించడం వంటివి సైబర్ నేరాల పరిధిలోకి వస్తాయన్నారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలన్నారు. నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బులు అడగడం, వ్యక్తిగత వివరాలు సేకరించడం వంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. డబ్బులు పోతే బాధితులు ఆలస్యం చేయకుండా సమాచారం అందిస్తే తిరిగి పొందే అవకాశాలు ఉంటాయన్నారు. సైబర్ నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. టౌన్ సీఐ కరుణాకర్, సైబర్ క్రైం ఎస్సైలు కృష్ణ, దినేష్, టౌన్ ఎస్సై సుప్రియ, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.


