ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. మద్దతు ధరకు మక్కలు కొనాలి. ప్రభుత్వం పట్టించుకోకపోతే.. రైతులంందరితో కలిసి ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తాత్సారం చేస్తుండటంతో వ్యాపారులు తక్కువ రేటు పెడుతున్నారు.
– పన్నాల తిరుపతిరెడ్డి, రైతు ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు
తక్కువకు కొంటున్నరు
ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే వ్యాపారులు మరింత తక్కువ ధరకు కొనే అవకాశం ఉంది. పంట పండించినప్పటికి రైతులు భారీగా నష్టపోవాల్సి వస్తుంది. కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు చొరవ చూపాలి.
– మారు మురళీధర్ రెడ్డి, జిల్లా రైతు ఐక్యవేదిక నాయకుడు


