‘సమగ్రశిక్ష’ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

‘సమగ్రశిక్ష’ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

Mar 10 2026 12:47 PM | Updated on Mar 10 2026 12:47 PM

జగిత్యాల: పట్టణ గురుకులాల్లో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని యూటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్ర అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కేజీబీవీ, యూఆర్‌ఎస్‌, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలు దీర్ఘకాలంగా ఉన్నాయన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. వోఎస్‌లను ప్రిన్సిపల్స్‌, పీజీ సీఆర్టీలను జూనియర్‌ లెక్చరర్లుగా నియమించాలని, కేజీబీవీల్లో కేర్‌ టేకర్లను నియమించాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 16న జిల్లా కేంద్రంలో.. 20న ఛలో అసెంబ్లీ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కవిత, కమల, ప్రణీత, గౌతమి, శ్రీలత, నారాయణ, రవీందర్‌, శ్రీనివాస్‌, ఫారూక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement