విద్యార్థుల చేతుల్లోనే దేశభవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల చేతుల్లోనే దేశభవిష్యత్‌

Mar 10 2026 12:47 PM | Updated on Mar 10 2026 12:47 PM

జగిత్యాల: విద్యార్థుల చేతుల్లోనే దేశభవిష్యత్‌ ఉందని అడిషనల్‌ కలెక్టర్‌ లత అన్నారు. ఎస్‌కేఎన్‌ఆర్‌ (ప్రభుత్వ) డిగ్రీ కళాశాలలో సోమవారం వికసిత్‌ భారత్‌–2047 యువ పార్లమెంట్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు రాజ్యాంగం, చట్టాలు, పౌరుల హక్కులు, కర్తవ్యాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎమర్జెన్సీ కాలంలో దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవని, అది ప్రజాస్వామ్య వ్యవస్థకు పరీక్షగా నిలిచిందన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో పౌరుల పాత్ర ముఖ్యమని, యువత చైతన్యంతో ముందుకు రావాలన్నారు. దేశాభివృద్ధికి కృషి చేయడం, రాజ్యాంగాన్ని గౌరవించడం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. అనంతరం వ్యక్తృత్వ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ అశోక్‌, యువజన క్రీడల అభివృద్ధి అధికారి రవికుమార్‌, ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌, ఎన్‌సీసీ అధికారి రాజు, భూమేశ్‌ పాల్గొన్నారు.

విద్యార్థులకు ఫోన్‌ ఇన్‌

జగిత్యాల: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు సందేహాలుంటే తీర్చేందుకు ఆయా సబ్జెక్ట్‌ల్లో నిపుణులైన 18 మంది ఉపాధ్యాయులను నియమించామని డీఈవో రాము తెలిపారు. ఎస్సెస్సీ పరీక్షలు సమీపిస్తున్న క్రమంలో ఈనెల 13 వరకు ఫోన్‌ఇన్‌ నిర్వహిస్తామన్నారు. ఉదయం 9.15 నుంచి సాయంత్రం 4.15 వరకు ఏ సందేహాలున్నా తెలుసుకోవచ్చన్నారు.

త్వరలో పాఠశాల ప్రహరీ క్లబ్‌లు

పాఠశాలల్లో మత్తు పదార్థాల నిర్మూలనకు త్వ రలో పాఠశాల ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు డీఈవో రాము తెలిపారు. భావితరాల ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సైకియాట్రిస్ట్‌ డింపుల్‌, సీసీపీసీ ఎస్సై కె.రాజు, సమగ్ర శిక్ష కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

రైతుమేళాకు తరలిన రైతులు

జగిత్యాలఅగ్రికల్చర్‌: హైదరాబాద్‌లోని వ్యవసాయ వర్సిటీలో జరుగుతున్న రైతుమేళాకు జిల్లా నుంచి రైతులు సోమవారం తరలివెళ్లారు. అల్లీపూర్‌, పొలాస, సారంగాపూర్‌, గు ల్లపేట గ్రామాల నుంచి రైతులు రైతుమేళాలో పాల్గొన్నారు. అక్కడ ప్రదర్శించిన స్టాల్స్‌ను తి లకించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆ ధునిక యంత్రాలను పరిశీలించారు. వ్యవసా య అనుభవం కార్యక్రమంలో వ్యవసాయ విద్యార్థులు తేజస్విని, అర్చన, నవ్యశ్రీ, రాజ శ్రీ, హిమబిందు, గణేశ్వరి, వర్ష పాల్గొన్నారు. శాస్త్రవేత్త ఎన్‌.సుమలత, అగ్రి హబ్‌ అసిస్టెంట్‌ దివ్య, అల్లీపూర్‌ ఎఫ్‌ఈవో చైర్మన్‌ శంకర్‌, పొ లాస మాజీ సర్పంచ్‌ శంకరయ్య పాల్గొన్నారు.

‘రాళ్లవాగు’ కుడికాలువకు నీటి విడుదల

కథలాపూర్‌: మండలంలోని భూషణరావుపే ట, కథలాపూర్‌ గ్రామాలకు రాళ్లవాగు ప్రాజెక్టు కుడికాలువ నుంచి సోమవారం నీరు వది లారు. నీరు విడుదల చేయాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అధికారులకు ఆదేశాలివ్వడంతో వ్యవసాయ మార్కెట్‌ డైరెక్టర్‌ వాకిటి రాజారెడ్డి ఆధ్వర్యంలో గేట్లు ఎత్తారు. ఆయన వెంట కాంగ్రెస్‌ నాయకులు కూన శ్రీనివాస్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement