మైనార్టీల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

మైనార్టీల సంక్షేమానికి కృషి

Mar 10 2026 12:47 PM | Updated on Mar 10 2026 12:47 PM

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ● మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ

ధర్మపురి: మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. కుట్టుమిషన్లతో కుటుంబంతోపాటు ఇతరులకు జీవనోపాధి కలుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌ మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి రోగుల వసతులపై అడిగి తెలుసుకున్నారు. గోదావరిలో స్వచ్ఛతను పరిశీలించారు.

పుష్కరాలకు భూములు సేకరించాలి

గోదావరి పుష్కరాలకు భూములు సేకరించాలని మంత్రి అధికారులకు సూచించారు. పుష్కరాలపై ఆలయ కార్యాలయంలో కలెక్టర్‌, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆర్డీవో మధుసూదన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వేముల నాగలక్ష్మి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ చిలుముల లావణ్య తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement