తొంబర్రావుపేట నుంచి కట్లకుంట వెళ్లే దారిని ఆక్రమించుకుని రాకేష్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేస్తున్నాడు. సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకుండా చేపట్టిన ఆ అక్రమ నిర్మాణంతో దారిలో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రోడ్డు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోండి.
– తొంబర్రావుపేట సర్పంచ్, సభ్యులు
హైడ్రా తరహా వ్యవస్థ తెండి
హైడ్రా వంటి వ్యవస్థను తెచ్చి జిల్లాలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు రక్షించండి. కొందరు అక్రమార్కులు చెరువులు, కుంటలను ఆక్రమించి రియల్ వెంచర్ల పేరిట అమాయకులకు అంటగట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. హైడ్రా తరహాలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి చెరువులు, కుంటలకు హద్దులు ఏర్పాటు చేయాలి.
– తోపారపు రజనీకాంత్, మత్స్య పారిశ్రామిక సంఘం పర్సన్ ఇన్‌చార్జి
విద్యుత్ సౌకర్యం కల్పించండి
జిల్లాకేంద్రంలోని జాంబాగ్ కబరస్తాన్‌లో ఏడాది క్రితం హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసిన బల్దియా అధికారులు విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. ము న్సిపల్ కమిషనర్‌ను సంప్రదించినా స్పందన లే దు. రంజాన్ సందర్భంగానైనా విద్యుత్ కనెక్షన్ ఇప్పించండి.
– నూర్‌భాషా సంక్షేమ సంఘం జగిత్యాల


