జిల్లాకేంద్రంలోని గొల్లపల్లిరోడ్డులోగల సత్యహరిశ్చంద్ర శ్మశాన వాటిక వద్ద డ్రైనేజీలో వ్యర్థాలు పడవేస్తుండటంతో దుర్వాసన వ్యాపించి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. డ్రైనేజీ వ్యర్థాలు ముప్పాల చెరువులో కలుస్తుండటంతో నీరు కలుషితమవుతోంది. మురుగు నీటి నియంత్రణకు జాంబాగ్ ప్రాంతంలో స్లాబ్‌తో కూడిన కల్వర్టు నిర్మించి ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించండి.
– సిరికొండ పద్మసింగరావు, 21వ వార్డు కౌన్సిలర్, జగిత్యాల
పోషించమంటే
చంపుతానంటుంది
మాది కొడిమ్యాల మండలం కోనాపూర్. నా భర్త మరణంతో కారుణ్య నియామకం కింద నా మూడో కూతురు ఆటకారి సరిత ఉద్యోగం పొందింది. డబ్బు, బంగారంతో అత్తగారింటికి వెళ్లిపోయింది. ఉద్యోగం పొందేటప్పడు పెద్ద మనుషుల సమక్షంలో నా సంరక్షణ భారం చూసుకుంటానని చెప్పింది. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. అడిగితే నన్నే చంపుతానంటూ బెదిరిస్తోంది. పెద్ద మనుషుల వద్దకు పిలిపిస్తే నాతో సంబంధం లేదంటోంది. ఉద్యోగం నుంచి ఆమెను తొలగించి.. నా బంగారం, డబ్బులు ఇప్పించండి.
– ఎండ్రికాయల గంగవ్వ,
కోనాపూర్, కొడిమ్యాల


