పెద్దవాగును పరిశీలించిన రెవెన్యూ అధికారులు
ఓ ఆడియో విషయమై పోలీసుల ఆరా
ఆత్మకూర్ వీడీసీ సభ్యులను హెచ్చరించిన పోలీసులు
మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలం ఆత్మకూర్ పెద్దవాగులో ఇసుక తవ్వకాలపై రెవెన్యూ, పోలీసు అధికారులు దృష్టి సారించారు. ‘పెద్దవాగులో అడ్డగోలు తవ్వకాలు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్ర చురితమైన కథనానికి స్పందించారు. ఆత్మకూర్ శివారులోని పెద్దవాగు వద్దకు తహసీల్దార్ నీత ఆదేశాలతో వెళ్లిన రెవెన్యూ సిబ్బంది.. మళ్లీ ఇసుక తవ్వకాలు చేపడుతున్నారా..? లేదా..? అని పరిశీలించారు. వీడీసీ సభ్యులను పిలిపించి ఇసుకకు సంబంఽధించి వైరలవుతున్న వీడీసీ అధ్యక్షుడి ఆడియోపై ప్రశ్నించారు. గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీ) సభ్యులు చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఇప్పటికే సీజ్ చేసిన నాలుగు ఇసు క ట్రాక్టర్లకు జరిమానా విధించనున్నట్లు తహసీల్దా ర్ నీత తెలిపారు. ఎక్కడైనా అక్రమ ఇసుక తవ్వకా లు చేపడితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.


