మెట్‌పల్లి: చట్టపరమైన రక్షణ కోసం మహిళలు న్యాయసేవా కేంద్రాలను వినియోగించుకోవాలని మెట్‌పల్లి సీనియర్ సివిల్ కోరుట్ల మేజిస్ట్రేట్ నాగేశ్వర్‌రావు అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ.. పని చేసే చోట అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టపరమైన రక్షణ కోసం న్యాయ సేవా కేంద్రాలను సంప్రదించాలన్నారు. అంతకు ముందు మహిళా న్యాయవాదులతో కలిసి కేకట కట్ చేశారు. జూనియర్ సివిల్ మేజిస్ట్రేట్ అరుణ్‌కుమార్, అడిషనల్ పీపీ చెర్లపల్లి ఆనంద్, పసునూరి శ్రీనివాస్, పడిగెల శ్రీనివాస్, బిగుల్లా శంకర్ తదితరులున్నారు.


