ఎక్స్‌ప్రెస్‌ బస్‌కు లగ్జరీ చార్జీలు | - | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ప్రెస్‌ బస్‌కు లగ్జరీ చార్జీలు

Jan 19 2026 4:33 AM | Updated on Jan 19 2026 4:33 AM

ఎక్స్

ఎక్స్‌ప్రెస్‌ బస్‌కు లగ్జరీ చార్జీలు

జగిత్యాల బస్టాండ్‌లో ప్రయాణికుల నిరసన

జగిత్యాలటౌన్‌: ఎక్స్‌ప్రెస్‌ బస్‌కు లగ్జరీ చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రయాణికులు జగిత్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం ఆందోళనకు దిగారు. సంక్రాంతి సెలవులకు సొంత గ్రామాలకు చేరుకున్న తాము తిరిగి హైదరాబాద్‌ వెళ్లేందుకు ఆన్‌లైన్‌లో లగ్జరీ బస్‌ టికెట్‌ బుక్‌ చేసుకుంటే లగ్జరీ బస్‌ స్థానంలో ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ ఏర్పాటు చేశారని ఆరోపించారు. సూపర్‌ లగ్జరీ పేరుతో రూ.520 వసూలు చేసిన ఆర్టీసీ యాజమాన్యం ఎక్స్‌ప్రెస్‌ బస్‌ కేటాయించడంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు బస్టాండ్‌ ఆవరణలో ఆందోళనకు దిగారు. కొద్దిసేపు బస్టాండ్‌లోకి బస్సులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడికి చేరుకున్న డీఎం కల్పన వారికి నచ్చచెప్పడంతో ఆందోళన విరమించుకున్నారు. డీఎం మాట్లాడుతూ సంక్రాంతి స్పెషల్‌ చార్జీల ప్రకారం ఆన్‌లైన్‌లో రేట్లు ఉన్నాయని, ప్రయాణికులు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.

వైద్యశిబిరానికి స్పందన

గొల్లపల్లి: ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గొల్లపల్లి మండలం దమ్మన్నపేటలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. గ్రామంతోపాటు చుట్టుపక్క గ్రామాల నుంచి ప్రజలు శిబిరానికి వచ్చి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. 355 మందికి పరీక్షలు చేసి మందులు అందించినట్లు వైద్యులు ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, ఇనగుర్తి రాజశేఖర్‌, ఆగంతం నరేశ్‌, రేగుంట ప్రశాంత్‌ తెలిపారు. సర్పంచ్‌ ముదాం గౌతమి, ఉపసర్పంచ్‌, రిటైర్డ్‌ జాయింట్‌ కలెక్టర్‌ కందుకూరి కృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి పాదం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 5న ‘చలో పార్లమెంట్‌’

కోరుట్లటౌన్‌: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 5న చలో పార్లమెంట్‌ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టు గజేందర్‌ తెలిపారు. ఆదివారం పట్టణంలో జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. విద్యాహక్కు చట్టం అమలు తేదీకి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్‌ మినహాయింపు ఇవ్వాలని పార్లమెంట్‌ సమావేశాల్లో చట్ట సవరణ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శి బైరం హరికిరణ్‌, పాలెపు శివరామకృష్ణ, ఉపాధ్యాయ ప్రతినిధులు శంకర్‌, రవీంధర్‌, ప్రవీణ్‌, శ్రీనివాస్‌, తిరుపతి చారి, అఖిల్‌ అహ్మద్‌, సాయి కుమార్‌, రత్నం , సురేష్‌, మహేష్‌, కృష్ణ, గంగాధర్‌, రాజశేఖర్‌, తిరుపతిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు గురుకుల విద్యార్థిని ఎంపిక

మల్యాల: మండలంలోని తాటిపల్లి బాలికల కళాశాలకు చెందిన విద్యార్థిని బాస హరిక జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ మానస తెలిపారు. గురుకుల కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని హారిక రాష్ట్ర స్థాయి అండర్‌–19 విభాగం కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి, జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై ందని, జనవరి 19 నుంచి 23 వరకు హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటుందని ప్రిన్సిపాల్‌ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని హారికను పీఈటీ మధులికను అభినందించారు.

ఎక్స్‌ప్రెస్‌ బస్‌కు   లగ్జరీ చార్జీలు1
1/3

ఎక్స్‌ప్రెస్‌ బస్‌కు లగ్జరీ చార్జీలు

ఎక్స్‌ప్రెస్‌ బస్‌కు   లగ్జరీ చార్జీలు2
2/3

ఎక్స్‌ప్రెస్‌ బస్‌కు లగ్జరీ చార్జీలు

ఎక్స్‌ప్రెస్‌ బస్‌కు   లగ్జరీ చార్జీలు3
3/3

ఎక్స్‌ప్రెస్‌ బస్‌కు లగ్జరీ చార్జీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement