ఎక్కడి నుంచి పోటీ చేద్దాం..?!
కోరుట్ల: అనుకూలిస్తాయన్న రిజర్వేషన్లలో చిన్నపాటి మార్పులు మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధమైన నేతలకు పెద్ద దెబ్బగా మారింది. ఓ వైపు తాము పోటీ చేయదలచిన వార్డులు మారడమే కాకుండా.. చైర్మన్ స్థానం కూడా మళ్లీ మహిళలకే కేటాయించడంతో కోరుట్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపు ఆశలు పెట్టుకున్న నేతల ఆశలు తారుమారయ్యాయి.
రిజర్వేషన్ల దెబ్బ..
కోరుట్ల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉన్నాయి. వాటిలో 16 స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు. రెండు ఎస్సీ, ఒకటి ఎస్టీలకు కేటాయించారు. మిగి లిన 8 స్థానాలు జనరల్‌గా నిర్ణయించారు. 6 వార్డులు బీసీ జనరల్‌గా ప్రకటించారు. చైర్మన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. ఈ క్రమంలో చైర్మన్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ పడుతున్న ముగ్గురు తమ వార్డులు జనరల్ కావడంతోపాటు చైర్మన్ స్థానం జనరల్ అయితే బాగుంటుందని మొన్నటివరకు ఆశల్లో ఉన్నారు. కానీ.. వా రి వార్డులు మొత్తం మహిళలకు రిజర్వ్ కేటా యించారు. అంతేకాకుండా చైర్మన్ స్థానంలో మా ర్పులు కూడా రావడంతో తామే బరిలో ఉండి చైర్మన్ గిరి పొందాలనుకున్న వారి ఆశలు గల్లంతయ్యాయి. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ సతీమణులను రంగంలోకి దించాల్సిన పరిస్థితి తలెత్తింది.
తొందరపడి..
రిజర్వేషన్లు ఖరారు కాకముందే మున్సిపల్ ఎన్నికల జోరులో మునిగితేలిన కొందరు అభ్యర్థులు రిజర్వేషన్లతో షాక్ అయ్యారు. ఓ అభ్యర్థి వారం రోజులు ముందుగానే తానే ఎన్నికల బరిలో ఉంటానని భావించి ఇంటింటికీ కిలో చికెన్, కూల్‌డ్రింక్‌లు పంచారు. రిజర్వేషన్ మారడంతో గందరగోళానికి గురయ్యాడు. మరో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు ఇదే రీతిలో పురుడు, పుట్టెంటుకల పేరిట విందు భోజనాలు ఏర్పాటు చేశారు. వీరంతా రిజర్వేషన్ల ఖరారుతో తమ దారి మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు ఓసీ అభ్యర్థులు ఆశించిన వార్డులను బీసీలకు రిజర్వ్ చేయడంతో పోటీ బాధ తప్పిందని పక్కకు తప్పుకున్నారు. ఇలా రిజర్వేషన్లు నేతల తలరాతల్లో మార్పులకు బీజం వేశాయి. ఇక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి పరిస్థితులను చూడాల్సి ఉంటుందోనని మున్సిపల్ ఆశావహులు కంగారు పడుతున్నారు.
చాలామందికి అనుకూలించని రిజర్వేషన్లు
కొత్త వార్డుల వెతుకులాటలో నాయకులు
పక్కవార్డులో పోటీ చేసేందుకు సిద్ధం


