చిలుక చిన్నమ్మకు మొక్కులు
మల్లాపూర్: మండలంలోని సంగెంశ్రీరాంపూర్‌లో ఆదివారం చిలుకల చిన్నమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ పాతకాల మానస, ఉపసర్పంచ్ మైస భీమన్న, మాజీ సర్పంచ్ పాలేపు దిలీప్ తదితర నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్సారెస్పీ ముంపుగ్రామాలైన సంగెంశ్రీరాంపూర్, కుస్తాపూర్, రత్నాపూర్, నడికుడ గ్రామాల్లోని ప్రతి ఇంటి నుంచి ఒకరు గోదావరి నదిలో స్నానమాచరించి నది జలాలను తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తారు. బోనాలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. చిలుకల చిన్నమ్మ అమ్మవారిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
భక్తుల సందడి
ఆలయంలో పూజలందుకుంటున్న అమ్మవారు


