మర్రిచెట్టులో తాటిచెట్టు
తాటికల్లు తాగడమంటే కల్లు ప్రియులకు ఎంతో ఇష్టం. ఓ భారీమర్రి చెట్టు మధ్యలో మొలచిన చెట్టుగా ఎదిగిన తాటిచెట్టు నుంచి వచ్చే కల్లును తాగేందుకు కల్లుప్రియులు ఎగబడుతున్నారు. పెద్దపల్లి మండలం హన్మంతునిపేట గ్రామంలోని శ్రీ సమ్మక్క – సారలమ్మ గద్దెల వద్ద ఉన్న ఈ మర్రిచెట్టు మధ్యలో ఎదిగిన తాటిచెట్టు నుంచి కల్లును తీసేందుకు గీతకార్మికుడు నిచ్చెన సాయం తీసుకుంటున్నాడు. తాటిచెట్టు వద్దకు చేరుకుని అక్కడనుంచి మోకుతో పైకి ఎక్కి కల్లు గీస్తున్నాడు. ఈచెట్టు కల్లుకు డిమాండ్ ఉంటుందని గీతకార్మికుడు తెలిపాడు.
–పెద్దపల్లిరూరల్


