మద్యం అమ్మితే రూ.10వేల జరిమానా
గంగాధర: గంగాధర మండలం మల్లాపూర్‌లో బెల్టుషాపులు నిషేధించాలని పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. గ్రామంలో మద్యం అమ్ముతున్న బెల్టుషాపులన్నీ బంద్ చేయాలని, మద్యం అమ్మితే రూ.10వేల జరిమానా విధిస్తామని సర్పంచు కొలెపాక కవిత అధ్యక్షతన పాలకవర్గం తీర్మానించింది. గ్రామంలో సుమారు నాలుగు బెల్ట్‌షాపులు ఉన్నాయి. అమ్మకాలు జోరుగా సాగుతుండడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో వాటిని బంద్ చేయాలని పాలకవర్గం నిర్ణయించింది. తీర్మానం ఆదివారం నుంచే అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
గ్రామంలో బెల్టు షాపుల బంద్
మల్లాపూర్‌లో పంచాయతీ తీర్మానం


