చలో.. మేడారం
● వనదేవతల జాతరకు ఆర్టీసీ సన్నద్ధం ● కరీంనగర్ రీజియన్ నుంచి 700 బస్సులు
● ఈనెల 27 నుంచి 31 వరకు ప్రత్యేక ట్రిప్పులు ● ‘మహాలక్ష్మి’ అమలుతో పెరగనున్న రద్దీ
మేడారం జాతరకు వెళ్లే వారికి అవసరమైన ఏర్పాట్లు చేశాం. 700 ప్రత్యేక బస్సులు నడిపేందుకు నిర్ణయించాం. రద్దీని బట్టి బస్సులను నడపడానికి ప్రయత్నిస్తాం. సంస్థలోని వివిధశాఖల అధికారులను బస్టాండ్‌లో అందుబాటులో ఉంచాం. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది.
– బి.రాజు, ఆర్టీసీ ఆర్‌ఎం
కరీంనగర్‌టౌన్: రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు కరీంనగర్ రీజియన్ ఆర్టీసీ అధికారులు సన్నద్ధం అయ్యారు. ప్రస్తుతం నడుస్తున్న బస్సులకు అదనంగా ఈనెల 27 నుంచి 31 వరకు రీజియన్ పరిధిలోని 11 డిపోల నుంచి 700 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా క్యూ రేలింగ్‌తో పాటు గ్రాండ్ బుకింగ్ సదుపాయాన్ని కల్పించారు. ఆర్టీసీ బస్సులు గద్దెల వరకు వెళ్లే ఏర్పాటు చేశారు. ఈ మేరకు కరీంనగర్ రీజియనల్ మేనేజర్ బి.రాజు ఇప్పటికే 11 డిపోల పరిధిలో అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి దిశానిర్దేశనం చేశారు. ఈ సారి మహాలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగనుంది.
ప్రత్యేక ఏర్పాట్లు
సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టింది. కరీంనగర్ బస్టాండ్‌లో మూడు క్యూలైన్ల సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం, తాత్కాలికంగా మూత్రశాలలు, హెల్త్ డిపార్ట్‌మెంట్ సహకారంతో వైద్య శిబిరాలు, ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం, ప్రయాణికులను సహకరించడానికి ఆర్టీసీ అధికారులను అందుబాటులో ఉంచుతున్నారు. కరీంనగర్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి 338 బస్సులు, జేబీఎస్, నిజామాబాద్, మెదక్ రీజియన్‌ల నుంచి మరో 362 బస్సులు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశారు.
సిబ్బందితో గేట్ మీటింగ్
సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని మేడారంలో ఈనెల 7న ఆర్‌ఎం రాజు ఆర్టీసీ సిబ్బందితో ఇప్పటికే గేట్‌మీటింగ్ నిర్వహించారు. కరీంనగర్‌లో సైతం సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై చ ర్చించారు. జాతరకు వెళ్లే భక్తులకు ఇక్కట్లు లేకుండా ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులను విజ యవంతంగా నిర్వహించాలని సూచించారు. జాతర సందర్భంగా డ్రైవర్లు బస్సులను ఓవర్ టేక్ చేయకుండా క్రమపద్ధతిలో వాహనాలు నడుపాలని, ఎలా ంటి ప్రమాదాలకు అవకాశం కల్పించవద్దని, భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు.
మేడారానికి చార్జీలు ఇలా..(రూ.లల్లో)
ప్రాంతం బస్సులు పెద్దలకు చిన్నారులకు
కరీంనగర్ 140 390 220
హుస్నాబాద్ 50 350 200
హుజూరాబాద్ 50 320 180
పెద్దపల్లి 175 420 240
గోదావరిఖని 115 400 230
మంథని 170 350 210
చలో.. మేడారం


