పురుడుపోసిన 108 సిబ్బంది | - | Sakshi
Sakshi News home page

పురుడుపోసిన 108 సిబ్బంది

Jan 18 2026 7:03 AM | Updated on Jan 18 2026 7:03 AM

పురుడుపోసిన 108 సిబ్బంది

పురుడుపోసిన 108 సిబ్బంది

మల్యాల: పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు 108 సిబ్బంది అంబులెన్స్‌లోనే పురుడు పోశారు. మల్యాల మండలం ముత్యంపేటలోని దిగువ కొండగట్టుకు ప్రాంతానికి చెందిన గంగోత్రికి శనివారం వేకువజామున రెండు గంటల సమయంలో పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా నొప్పులు అధికమయ్యాయి. ఈఎంటీ కరుణాకర్‌, పైలట్‌ శ్రీనివాస్‌ సహకారంతో ఆమెకు మగబిడ్డకు పురుడు పోశారు. అనంతరం ఇద్దరినీ మాతా శిశు ఆస్పత్రికి తరలించారు. గంగోత్రి కుటుంబ సభ్యులు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

జగిత్యాల ఏఎస్పీ బదిలీ

జగిత్యాలక్రైం: జగిత్యాల ఏఎస్పీ శేషాద్రినిరెడ్డిని బదిలీ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్‌లోని డీసీపీ ట్రాఫిక్‌–2 కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ లా అండ్‌ ఆర్డర్‌ జోన్స్‌ సైబరాబాద్‌ కమిషనరేట్‌కు ఆమెను బదిలీ చేశారు. ఆమె స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.

సీఎమ్మార్‌ సేకరణకు అనుమతి

జగిత్యాలరూరల్‌: ఈ ఏడాది వానకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించిన ధాన్యాన్ని సీఎమ్మార్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌)గా ప్రభుత్వానికి సరఫరా చేయాల్సి ఉంది. 2024–25 వానకాలంలో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని జిల్లాలోని సుమారు 42 రైస్‌మిల్లర్లకు కేటాయించింది. ఫిబ్రవరి 16లోపు సుమారు 50వేల టన్నుల బియ్యాన్ని సేకరించేందుకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

చదువుతోనే భవిష్యత్‌

జగిత్యాలజోన్‌:విద్యార్థులకు చదువుతోనే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని జిల్లా సబ్‌ జడ్జి, న్యాయసేవా సంస్థ కార్యదర్శి వెంకట మల్లిక్‌ సుబ్రహ్మణ్య శర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలసదన్‌ను సందర్శించారు. విద్యార్థుల బాగోగులు తెలుసుకున్నారు. కష్టపడి చదవి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు చిన్నారులతో ముచ్చటించారు. జిల్లా లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కటుకం చంద్రమోహన్‌, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫె న్స్‌ కౌన్సిల్‌ విజయకృష్ణ, అనురాధ పాల్గొన్నారు.

ఇంటివద్దకే మేడారం ప్రసాదం

విద్యానగర్‌(కరీంనగర్‌): మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు రూ.299 చెల్లిస్తే సమ్మక్క సారలమ్మలు ఉన్న ఫొటోతోపాటు అమ్మవార్ల పసుపు, కుంకుమ, బెల్లం ప్రసాదాన్ని అందజేయనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్‌ జోన్‌ ఏటీఎం లాజిస్టిక్స్‌ బాధ్యులు వెంకట నారాయణ, ఆర్‌ఎం ఎ.రాజు శనివారం తెలిపారు. ఈనెల 31 వరకు www. tgsrtclogistics. co. in వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకుంటే, ప్రసాదం ప్యాకెట్‌ ఇంటికి తెచ్చి ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు 9154298581, 9154298561, 9154298559 నంబర్లల్లో సంప్రదించాలని సూచించారు.

బల్దియాల్లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయాలి

జగిత్యాల: అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. కాంగ్రెస్‌కు ధనబలం, అధికార బలం ఉన్నా.. బీఆర్‌ఎస్‌కు ప్రజా బలం ఉందని తెలిపారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం జగిత్యాల, రాయికల్‌ మున్సిపాలిటీల నాయకులతో సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్‌ హయాంలో చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీఆర్‌ఎస్‌ ఉద్యమ పార్టీ అని, అనేక ఒడిదుడుకులు చూసిందని, పార్టీ మారిన వారి గురించి బాధపడాల్సిన అవసరం లేదని తెలిపారు. జగిత్యాలను జిల్లాగా చేసి అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ఇక్కడి బల్దియాలో పాగా వేసి కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలన్నారు. పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు మాట్లాడు తూ మోసపూరిత హామీలతో అధికారంలోకొ చ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలన్నా రు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత మాట్లాడుతూ.. జగిత్యాల, రాయికల్‌ మున్సి పాలిటీలను కై వసం చేసుకోవాలని కోరారు. గతంలో సాధించిన సీట్ల కన్నా అత్యధికంగా గెలుచుకోవాలన్నారు. ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. మాజీమంత్రి రాజేశంగౌడ్‌, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ హరిచరణ్‌రావు, ప్రత్యే క ఆహ్వానితులు ఓరుగంటి రమణారావు, మాజీ కౌన్సిలర్లు దేవేందర్‌నాయక్‌, శివకేసరిబాబు, వొల్లం మల్లేశం, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ శీలం ప్రియాంక పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement