ఆలకించండి.. పరిష్కరించండి
జగిత్యాలటౌన్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితులు జిల్లావ్యాప్తంగా తరలివచ్చారు. వారి నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి వచ్చిన సమస్యలపై సమగ్ర విచారణ జరిపి పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, శిక్షణ డిప్యుటీ కలెక్టర్ హారిణి, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు మధుసూదన్‌గౌడ్, జివాకర్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
బీటీ రోడ్డు వేయండి
జిల్లాకేంద్రం నుంచి మోతె బైపాస్ మీదుగా వెల్దుర్తి గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డు పాడైంది. రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, కార్లు రావడం లేదు. 2009లో నిర్మించిన రోడ్డుకు మూడేళ్ల క్రితం మరమ్మతు చేశారు. బీటీ రోడ్డుకు ఒప్పందం కూడా అయ్యింది. రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోండి.
– వెల్దుర్తి సర్పంచ్, పాలకవర్గం
పరిహారం ఇప్పంచండి
Ð]l*¨ Möyìl-Ð]l*ÅÌS Ð]l$…yýl-ÌS… ç³Nyýl*Æý‡$. fW™éÅÌS Ò$§ýl$-V> Mø§éyýl Ð]lÆý‡MýS$ °ÇÃçÜ$¢¯]l² gê¡Ä¶æ$ Æý‡çßæ-§éÇ 563ÌZ {V>Ð]l$…-ÌZ° ç³Ë$Ð]l#Æý‡$ Ð]lÅÐ]l-ÝëĶæ$ ¿¶æ*Ð]l¬-Ë$, Câ¶æ$Ï, Rêä´ëÏr$Ï MøÌZµ-™èl$-¯é²Æý‡$. hÌêÏ ç³Ç«¨ÌZ Cç³µ-sìæMóS ç³Ë$ {V>Ð]l*-ÌZÏ ç³ÇàÆý‡… A…¨…-^éÆý‡$. Ð]l* {V>Ð]l*-°MìS Ð]l*{™èl… ç³ÇàÆý‡… A…§ýl-Ìôæ§ýl$. ÒOÌñæ-¯]l…™èl ™èlÓÆý‡-V> ç³ÇàÆý‡… Cí³µ…^ól-Ìê ^èl*yéÍ. త
– – పూడూరు గ్రామస్తులు
అడ్డుపడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోండి
మాది కథలాపూర్ మండలం సిరికొండ. గౌడ సంఘం అభివృద్ధికి మల్యాల శ్రీనివాస్ అడ్డు తగులుతున్నాడు. సర్వేనంబర్ 463లోని 8.32 ఎకరాలను కులస్తులందరి సమ్మతితో విక్రయించి ఎల్లమ్మ తల్లి ఆలయం నిర్మించాం. భూమికి సంబంధించిన డబ్బులను మేం పంచుకున్నామని అంటూ శ్రీనివాస్ రిజిస్ట్రేషన్ అడ్డుకుంటున్నాడు. పైగా కుల బహిష్కరణ చేశారంటున్నాడు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ విచారణ చేపట్టి ఎలాంటి అవకతవకలూ జరగలేదని నిర్దారించారు. ఆ తీర్మానంపై శ్రీనివాస్ కూడా సంతకం చేశాడు. ఇప్పుడు సభ్యులపై అక్రమంగా కేసులు పెడుతూ వేధిస్తున్నాడు.
– సిరికొండ గౌడ కులస్తులు, కథలాపూర్
కోతులను నివారించాలి
జిల్లాకేంద్రంలోని తొమ్మిదో వార్డు ధరూర్‌క్యాంపు, హౌజింగ్‌బోర్డు, వినాయకనగర్, శ్రీనగర్ కాలనీల్లో కోతుల బెడద అధికంగా ఉంది. దాడి చేస్తూ పలువురిని గాయపరుస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. కాలనీవాసుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కోతులను నియంత్రించండి.
– గడ్డల లక్ష్మి, బీజేపీ నాయకురాలు
ఆలకించండి.. పరిష్కరించండి
ఆలకించండి.. పరిష్కరించండి
ఆలకించండి.. పరిష్కరించండి
ఆలకించండి.. పరిష్కరించండి


