ముక్కోటికి ఏర్పాట్లు
ముక్కోటికి ముస్తాబైన ధర్మపురి దేవస్థానం
ముస్తాబైన శ్రీరామలింగేశ్వర ఆలయం
ధర్మపురి/మల్లాపూర్:ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలను ముస్తాబు చేశారు. భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం, మల్లాపూర్‌లోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయాలను అందంగా అలంకరించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆదేశాల మేరకు నృసింహాలయం లోపల విద్యుత్‌దీపాలతో అలంకరించారు. ముందు, వెనుక భాగంలో ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు చేశారు. భక్తుల కోసం లడ్డూ, పులిహోర తయారు చేయించారు. ముక్కోటి సందర్భంగా యోగా, ఉగ్ర లక్ష్మీనృసింహుడితోపాటు శ్రీవేంకటేశ్వర స్వాములకు ప్రత్యేక పూజలు చేస్తారు. ధర్మపురి పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి చేతులమీదుగా ఉత్తరద్వారం తెరుస్తారు. మల్లాపూర్ మండలం వాల్గొండలోని త్రికూటాలయం ఉత్తర ముఖద్వారం కలిగిన అతిపురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. వేకువజామున ఆలయంలోని శివలింగంపై సూర్యకిరణాలు నేరుగా ప్రసరించడం ఆలయం ప్రత్యేకత. ముక్కోటికి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ సాంబారి శంకర్, వైస్ చైర్మన్ చిలివేరి లక్ష్మీ తెలిపారు.
ముక్కోటికి ఏర్పాట్లు
ముక్కోటికి ఏర్పాట్లు


