కొండగట్టు ఆలయ భూములు రక్షించండి
మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయ భూములను రక్షించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. శ్రీఆంజనేయస్వామి వారిని బుధవారం దర్శించుకున్నారు. ఆలయ భూముల హద్దులు పరిశీలించారు. వందల ఏళ్ల నాటి ఆలయ భూములను అటవీశాఖ భూములు అనడం సరికాదన్నా రు. మాజీ సీఎం కేసీఆర్ కొండగట్టును యాదాద్రిని మించి అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు చేశారని పేర్కొన్నారు. కొండగట్టులో దేవాదాయ, అటవీశాఖల మధ్య భూముల వివాదం నెలకొన్నా.. మంత్రి కొండా సురేఖ పట్టించుకోకపోవడంపై సరికాదన్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచినా బండి సంజ య్ ఆలయ అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. మాజీ జెడ్పీటీసీ కొండపల్కల రాంమోహన్‌రావు, పునుగోటి కృష్ణారావు, బోయినపల్లి మధుసూదన్‌రావు, బద్దం తిరుపతి రెడ్డి, కొండబత్తిని త్రినాథ్, ఎండీ.అజారొద్దీన్ పాల్గొన్నారు.


