పదేళ్లు ఏం చేశారు..
జగిత్యాలటౌన్: యావర్‌రోడ్డు విస్తరిస్తేనే రాజకీయాల్లో కొనసాగుతానంటున్న ఎమ్మెల్యే సంజయ్ వ్యాఖ్యలు హాస్యాస్పదని, పదేళ్లుగా ఏం చేశారో ప్రజలకు చెప్పాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యావర్‌రోడ్డును ఆనుకుని ఉన్న షాపుల యజమానులను ఒప్పించి 40 ఫీట్ల నుంచి 60ఫీట్లకు.. 2014లో తిరిగి ఎమ్మెల్యే అయ్యాక 100ఫీట్లకు విస్తరించేందుకు మున్సిపాలిటీలో తీర్మానాన్ని ఆమోదింపజేశానని, ప్రజాభిప్రాయ సేకరణ చేయించి 2017లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వానికి నివేదించానని గుర్తు చేశారు. ఆ ఫైల్‌ను తొక్కిపెట్టిన అప్పటిమంత్రి కేటీఆర్ 2018 ఎన్నికల సందర్భంగా సంజయ్‌ను గెలిపిస్తే యావర్‌రోడ్డు విస్తరిస్తామంటూ హామీ ఇచ్చారని, 2023 ఎన్నికల్లో టీడీఆర్‌ను తెరపైకి తెచ్చారని తెలిపారు. కాలయాపనకు కారణమైన ఎమ్మెల్యే చేసిన పాపం కడుక్కుంటే పోదన్నారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే ముందు యావర్‌రోడ్డులోని అక్రమ నిర్మాణాలు తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకూ ఉందన్నారు. ఆక్రమణలను అడ్డుకుంటున్న అదృశ్యశక్తి ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఆయన వెంట బండ శంకర్, గాజుల రాజేందర్, జున్ను రాజేందర్, సురేందర్ పుప్పాల అశోక్, దుర్గయ్య, ధర రమేష్, మన్సూర్, ఎండీ భారీ, రాదాకిషన్, రఘువీర్‌గౌడ్ ఉన్నారు.
గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు
మల్లాపూర్/ఇబ్రహీంపట్నం: గోదావరి పుష్కరాల కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ తెలిపారు. మల్లాపూర్ మండలం వాల్గొండ శ్రీరామలింగేశ్వర స్వామి ఆల య సమీపంలో.. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి వద్ద పుష్కరఘాట్లను స్టేట్ టీం సభ్యులతో మంగళవారం పరిశీలించారు. గతంలో పుష్కరా లకు వచ్చిన భక్తులు, వారి కోసం ఏర్పాటు చేసిన స్టాళ్లు, తాగునీరు, తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్, ఇతర ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. 20 27లో గోదావరి పుష్కరాలను సమర్థవంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ధర్మపురి, వాల్గొండతో పాటు ప్రధాన ఘాట్ల వద్ద శాశ్వత ఏర్పాట్లు చేస్తామన్నారు. రద్దీని నియంత్రించడం, ట్రాఫిక్ నిర్వహణపై దృష్టి సారించామన్నారు. తహసీల్దార్లు రమేశ్‌గౌడ్, వరప్రసాద్, ఎంపీడీవోలు శ్రీకాంత్, గణేశ్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ ఆనంద్, ఇరిగేషన్ డీఈ దే వా నంద్, రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చై ర్మ న్ సాంబారి శంకర్, దేవదాయశాఖ ఈవో విక్రమ్‌గౌడ్, సర్పంచు గంగాధర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
పదేళ్లు ఏం చేశారు..


