ఒంటరి తనం భరించలేక ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
మేడిపల్లి: మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కొండాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లి జలందర్ అనే వ్యక్తికి ఏడేళ్ల క్రితం వివాహం కాగా, కొద్ది నెలలకే విడాకులయ్యాయి. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న జలందర్ ఇలీవలే గల్ఫ్ వెళ్లి తిరిగి వచ్చాడు. 18 నెలలుగా ఒంటరిగా ఉంటున్న జలందర్ మానసికంగా బాధపడుతున్నాడు. జీవితం మీద విరక్తితో మంగళవారం ఇంటిలో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి గొల్లపల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్త్సె శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
14 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
రాయికల్: మండలంలోని ఇటిక్యాల పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 14 ట్రాక్టర్లను మంగళవారం తహసీల్దార్ నాగార్జున మైనింగ్ అధికారుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు.
కుజదోష నివారణ పూజలు
ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో మంగళవారం కుజదో ష నివారణ పూజలు చేశారు. ఆలయ అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య కుటుంబ కలహాలు, వాస్తుదోషాలు ఉన్నవారు కుజదోష నివారణ పూజలు చేశారు.
జలంధర్(ఫైల్)
ఒంటరి తనం భరించలేక ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య


