
టీ–హబ్ సందర్శన
మెట్‌పల్లి: నియోజకవర్గంలోని పలు డిగ్రీ కళా శాలల విద్యార్థులు సోమవారం ఎమ్మెల్యే కల్వ కుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ని టీ–హబ్‌ను సందర్శించారు. అందులోని స్టార్టప్ ప్రాజెక్టులు, ఆధునిక టెక్నాలజీ విభా గాలు, ఇన్నోవేషన్ ల్యాబ్‌ల గురించి తెలుసుకున్నారు. దేశంలోనే అతి పెద్ద ఆవిష్కరణ, వ్యాపార ఇంక్యుబేషన్ కేంద్రమైన టీహబ్ తెలంగాణలో ఉండడం గర్వకారణమని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థులు భవిష్యత్‌లో స్టార్టప్‌లతో స్వయం ఉపాధి పొందేలా ఎదగాలని ఆకాంక్షించారు.
దుబ్బ రాజన్న ఆలయ హుండీ ఆదాయం రూ.15.46 లక్షలు
సారంగాపూర్: ప్రముఖ పుణ్యక్షేత్రం దుబ్బ రాజన్న ఆలయ హుండీ ఆదాయాన్ని సోమవారం ఆలయ ఆవరణలో లెక్కించారు. రూ.15,46,421 సమకూరింది. లెక్కింపులో దేవాదాయశాఖ జగిత్యాల పరిశీలకుడు రాజ మొగిలి, ఈవో అనూష, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పొరండ్ల శంకరయ్య, రెనొవేషన్ కమి టీ సభ్యులు రంగు శంకర్‌గౌడ్, పిన్నం సత్యం, పంగ కిష్టయ్య, పంచాయతీ కార్యదర్శులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
జగిత్యాలటౌన్: ఆశ వర్కర్ల వేతన కోతల ఆలోచన మానుకొని రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ అన్నారు. సోమవారం సీఐటీయూ అనుబంధ ఆశ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో మాట్లాడారు. అర్హత కలిగిన ఆశాలకు ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం నియామకాల్లో వెయిటేజీ కల్పించాలని కోరారు. 2022, 2023, 2024 లెప్రసీ సర్వే పెండింగ్ డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. గత 15 రోజుల సమ్మె సందర్భంగా హెల్త్ డైరెక్టర్ ఇచ్చిన హామీలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలిపారు. ఆశాలు చేస్తున్న పారితోషికం లేని పనులు రద్దు చేయాలని, ప్రతీ ఆదివారం, పండుగలకు సెలవులు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. సీ ఐటీయూ నాయకురాలు ఇందూరి సులోచన, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అద్యక్షురాలు ఆత్మకూరు లత, జిల్లా కార్యదర్శి మెట్టు మమ త, జిల్లా కమిటీ సభ్యులు రాయికంటి దివ్య, బత్తిని వసంత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏపీవో సస్పెన్షన్
జగిత్యాల: కథలాపూర్ మండల ఉపాధిహామీ పథకం ప్రోగ్రాం ఆఫీరస్ (ఏపీవో) రాజేందర్‌ను సస్పెండ్ చేసినట్లు డీఆర్డీఏ పీడీ రఘువరణ్ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం చేయడంతో పాటు, ఇటీవల పనుల జాతర కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇన్‌చార్జిగా కోరుట్ల ఏపీవో మమతను నియమించినట్లు తెలిపారు.
ఎస్సారెస్పీ వరద కాల్వకు 20వేల క్యూసెక్కుల నీరు
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాల్వకు 20 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు గేట్లు మూసివేసి, కాకతీయ కెనాల్‌కు 3500 క్యూసెక్కులు, వరద కాల్వకు 20 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 500 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువకు 150 క్యూసెక్కులు, అలీసాగర్–గుత్పా ఎత్తిపోతల పథకానికి 360 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 29,907 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఆ మేరకు నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.

టీ–హబ్ సందర్శన

టీ–హబ్ సందర్శన

టీ–హబ్ సందర్శన