
నిబంధనలు సరికాదు
రైతులు ఓట్లేసి గెలిపిస్తే సహకార సంఘం డైరెక్టర్‌గా ఎన్నికయ్యాం. డైరెక్టర్లకు రుణాల బకాయిలుంటే పదవి కొనసాగించకపోవడం దారుణం. రైతులకు సేవలందించడానికి సహకార సంఘాలు కృషి చేస్తున్నాయి. సహకార సంఘాలపై కొత్త నిబంధనలు సరికాదు. కొత్త జీవోను రద్దు చేయాలి.
– జలంధర్‌రెడ్డి, సహకార సంఘం డైరెక్టర్, తాండ్య్రాల
ఉన్నతాధికారులకు పంపిస్తాం
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాలకవర్గాల సభ్యులు తీసుకున్న రుణాలు, తిరిగి చెల్లించిన వాటి వివరాలను ఉన్నతాధికారులకు పంపిస్తాం. నిబంధనల ప్రకారం అర్హత గల సహకార సంఘాలకు పొడిగింపు ఉత్తర్వులు వస్తాయి. ఈ విషయంలో మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగుతాం.
– మనోజ్‌కుమార్, జిల్లా సహకార అధికారి

నిబంధనలు సరికాదు