
వరదకాలువను పరిశీలించిన ఎస్‌ఈ
మల్యాల: ఎస్సారెస్పీ నుంచి మిడ్‌మానేరుకు వరదకాలువ ద్వారా 22వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆ ప్రవాహాన్ని మండలంలోని నూకపల్లి శివారులో నీటి పారుదల శాఖ ఎస్‌ఈ రమేశ్ శనివారం పరిశీలించారు. వరదకాలువ నీటి సామర్థ్యం 22వేల క్యూసెక్కులు. అంతేమొత్తంలో నీరు విడుదల చేయంతో కాలువ నిండుగా ప్రవహిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఈ రమేశ్ పేర్కొన్నారు. ఆయన వెంట డీఈఈ తిరుపతి, ఏఈఈ అరుణ్‌కుమార్, వర్క్ ఇన్స్‌పెక్టర్ దాది మహేశ్ పాల్గొన్నారు.
నానో యూరియాపై అవగాహన
జగిత్యాలఅగ్రికల్చర్: నానో యూరియా పిచికా రీపై ఇఫ్కో, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల అర్బన్ మండలం ధరూర్‌లో రైతులకు అవగాహన కల్పించారు. ఏవో వినీల మాట్లాడుతూ.. నానో యూరియా, నానో డీఏపీతో రైతులకు అధిక లాభం జరుగుతుందని, పర్యావరణానికి ఇబ్బందులు కూడా ఉండవని పేర్కొన్నారు. ఇఫ్కో జిల్లా మేనేజర్ శ్రీధర్ మాట్లాడుతూ రసాయన ఎరువులను తగ్గించుకుని నానో ఎరువులు పిచికారీ చేయాలని సూచించారు. ఏఈవో నాగరాజు, రైతులు పాల్గొన్నారు.
ఎస్సారెస్పీకి 1.7 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు 1.7 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో గేట్ల ద్వారా 14,375 క్యూసెక్కులు, కాకతీయ మెయిన్ కెనాల్‌కు 6,250, ఎస్కేప్ ద్వారా 1,748, లక్ష్మీ కెనాల్‌కు 150, సరస్వతి కెనాల్‌కు 417, వరదకాలువకు 20వేలు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 51.024 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

వరదకాలువను పరిశీలించిన ఎస్‌ఈ

వరదకాలువను పరిశీలించిన ఎస్‌ఈ