
యూరియా కోసం బారులు
జగిత్యాలరూరల్: యూరియా కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారు. రెండురోజులుగా ఎరువు అందుబాటులో లేకపోవడంతో పడిగాపులు కాస్తున్నారు. శనివారం ఉదయం పొరండ్ల సహకార సంఘం గోదాంకు యూరియా రావడంతో రైతులు బారులు తీరారు. చాలామందికి అందకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.
పంటలు ఎలా ఉన్నాయి..?
జగిత్యాలఅగ్రికల్చర్: పొలాస వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తక్కళ్లపల్లి గ్రామంలో పర్యటించారు. అక్కడి రైతులు సాగు చేసిన పసుపు, వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. రైతులకు పలు సూచనలు చేశారు. వరి లో కాండం తొలుచు పురుగు, ఆకు ముడత పురుగు ఉన్నందున నివారణ చర్యలు తీసుకో వాలని సూచించారు. ఆయా పంటల్లో ఎరువు ల యజమాన్యంపై వివరించారు. వ్యవసాయ ప్రొఫెసర్లు ఎల్లాగౌడ్, వేణుగోపాల్, తిరుపతి, రాజేంద్రప్రసాద్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

యూరియా కోసం బారులు