
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల: అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని 10, 12 వార్డుల్లో రూ.20 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు గురువారం భూమిపూజ చేశారు. పనులు నాణ్యతతో చేపట్టాలన్నారు. ఆయన వెంట కమిషనర్ స్పందన, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్, వరుణ్, ఖాదర్, రాజిరెడ్డి, రాజయ్య పాల్గొన్నారు.
డబుల్ బెడ్‌రూంలలో వసతులు
డబుల్‌బెడ్‌రూంలో ఇళ్లలో వసతులు కల్పిస్తున్నామని, బస్తీదవాఖానా, వీధిదీపాలు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. డబుల్‌బెడ్‌రూంకాలనీలో అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, బస్తీ దవాఖానాను గురువారం ప్రారంభించారు. వీటికి త్వరలోనే పక్కా భవనాలు నిర్మిస్తామన్నారు. అదనపు కలెక్టర్ లత మాట్లాడుతూ కేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. డీడబ్ల్యూవో నరేశ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉద్యానవనంలో వసతులు కల్పించాలి
ఉద్యానవనంలో వసతులు కల్పించాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఏళ్ల తరబడిగా ప్రజలు ఉంటున్న ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలన్నారు. క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తే యువత చెడు అలవాట్ల వైపు వెళ్లరని తెలిపారు.
క్రీడామైదానం ఏర్పాటుకు కృషి
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్‌కు చెందిన యువత గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.