
ప్రజలను అప్రమత్తం చేయండి
ధర్మపురి: గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నందును తీరప్రాంత వాసులను అప్రమత్తం చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పోలీస్, మున్సిపల్, రెవెన్యూ శాఖలను ఆదేశించారు. గోదావరి ప్రవాహాన్ని బుధవారం అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. స్నానాల కోసం వచ్చే భక్తులు లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలక తరలించాలని సూచించారు. ఆపద సమయంలో తనకు ఫోన్ చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్, నాయకులు ఎస్.దినేష్, చిపిరిశెట్టి రాజేశ్, వేముల రాజు తదితరులున్నారు.