TSRTC MD Sajjanar Congratulated TSRTC Driver | Woman Put Her Head Under RTC Bus In Metpally To Jagtial District, Video Viral - Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డ్రైవర్‌ రాములుకు సజ్జనార్‌ అభినందన!

Published Sat, Jul 22 2023 12:22 AM | Last Updated on Sat, Jul 22 2023 1:11 PM

- - Sakshi

జగిత్యాల: ఆర్టీసీ డ్రైవర్‌ రాములును ఆ సంస్థ ఎండీ సజ్జనార్‌ ట్విట్టర్‌ ద్వారా అభినందించారు. పట్టణంలోని కొత్త బస్టాండ్‌ వద్ద గురువారం ఆర్టీసీ బస్సు కిందపడి ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించగా, డ్రైవర్‌ రాములు వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. ఈ సంఘటనలో ఆమెకు ప్రాణాప్రాయం తప్పింది.

గాయాలతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న ఎండీ సజ్జనార్‌.. డ్రైవర్‌ను అభినందించారు. ‘చాకచక్యం, అప్రమత్తతతో నిండు ప్రాణం నిలిచింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ మహిళ ప్రా ణాలు కాపాడిన డ్రైవర్‌ రాములుకు అభినందనలు’ అని సజ్జనార్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement