ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బు.. ధరెంతంటే ?

World’s Most Expensive Bar of Soap Is Made In Lebanon - Sakshi

అసలు సబ్బు అంటే ఎలాగుండాలి.. మంచి కలర్‌ఫుల్‌గా ఉండాలి.. ఇది చూడండి.. ఇది కూడా సబ్బేనా.. చూశారుగా ఎలాగుందో.. అయితే.. ఇది చాలా ‘లక్ష’ణమైన సోప్‌ అట.. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బు. ధర కేవలం రూ.2.07 లక్షలు!! ఎందుకంత అని అడిగితే.. ఇందులో 17 గ్రాముల మేలిమి బంగారం, కొన్ని గ్రాముల వజ్రాల పొడి కూడా ఉందని దీన్ని తయారుచేసిన బడేర్‌ హసన్‌ అండ్‌ సన్స్‌ వాళ్లు చెప్పారు..

వీటితోపాటు అలీవ్‌ నూన్, ఆర్గానిక్‌ తేనె, ఖర్జూరం ఇలా చాలావాటిని వేసి.. దీన్ని తయారుచేశారట.. లెబనాన్‌లోని ట్రిపోలీకి చెందిన ఈ కుటుంబం హ్యాండ్‌ మేడ్‌ సోప్స్, ఖరీదైన సబ్బులు తయారుచేయడంలో పేరెన్నికగన్నవారు.. 15వ శతాబ్దం నుంచీ వీళ్లు ఇదే బిజినెస్‌లో ఉన్నారు. దీన్ని ఈ మధ్య కొందరు ప్రముఖులకు బహుమతిగా ఇచ్చారు.. ఇచ్చినప్పుడు వారి పేరును బంగారంతో ఈ సబ్బుపై చెక్కించి మరీ ఇచ్చారట.. ఇది కొంత మందికే ప్రత్యేకమా.. లేక అందరూ దీన్ని కొనొచ్చా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.. క్లారిటీ వస్తే..  కొనే ఉద్దేశం ఉందా ఏమిటి మీకు?  చదవండి: (ఆ దేశాల్లో కరోనా రోగుల్ని గుర్తించే శునకాలు)

Election 2024

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top