World Oldest Person: 118 ఏళ్ల వ్యక్తి ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా.. చాక్లెట్, ఓ గ్లాస్‌ వైన్‌

World Oldest Person Reveals Secret to Long Life: A Glass of Wine Chocolate Everyday - Sakshi

సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌: ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలి? అంటే.. రోజూ వ్యాయామం చేయాలి. మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. సమయానికి నిద్ర పోవాలి.. ఇలా రకరకాలుగా చెబుతూనే ఉంటారు. కానీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసు వ్యక్తిగా (118 ఏళ్లు) ఇటీవలే గిన్నిస్‌ రికార్డుకెక్కిన ఫ్రెంచ్‌ నన్‌ సిస్టర్‌ ఆండ్రే ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా? ఆమె రోజు తీసుకునే చాక్లెట్, ఓ గ్లాస్‌ వైన్‌. ఆండ్రే నర్సింగ్‌ హోమ్‌లో పని చేస్తున్న డేవిడ్‌ టవెల్లా ఇదే చెబుతున్నారు.

‘ఆండ్రూ రోజూ తీసుకునే గ్లాస్‌ వైన్‌ వల్లే తాను జీవిత కాలం పెరగడానికి కారణమేమో. నేను మాత్రం వైన్‌ తాగమని ఎవరికీ సలహా ఇవ్వను’ అని డేవిడ్‌ అంటున్నారు. గతంలో ఎక్కువ వయసున్న వ్యక్తి రికార్డు జపాన్‌కు చెందిన కేన్‌ టనక పేరిట ఉండేది. తాను ఈ ఏడాది ఏప్రిల్‌ 19న మరణించారు. దీంతో ఈ రికార్డు ఆండ్రే సొంతమైంది. కరోనా బారిన పడి కోలుకున్న పెద్ద వయస్కురాలిగా కూడా ఆండ్రే రికార్డుకెక్కారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top