300 కోట్ల మందికి సముద్రమే ఆధారం

World Oceans Day 10 Interesting Facts On Oceans - Sakshi

మనం చేసే కాలుష్యంతో సముద్రాలకు ముప్పు

సముద్రాలు బాగుండాలి జీవులు బాగుండాలి

ఓషియన్‌ కాన్ఫరెన్స్‌కి ఎంపికైన ఏపీ మహిళ

వెబ్‌డెస్క్‌:  భూమిపై 29 శాతం నేల ఉంటే మిగిలిన 71 శాతం సముద్ర నీరే ఉంది. ఈ ధరణిపై నివసించే ప్రాణులన్నీ ప్రత్యక్షంగా , పరోక్షంగా సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నాయి. కడలి బాగుంటేనే  జీవరాశులన్నీ బాగుంటాయి. సముద్రాలకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించే ప్రతీ ఏడు జూన్‌ 8న ప్రపంచ సముద్ర దినోత్సం  నిర్వహిస్తున్నారు. 

బాగుండాలి
బ్రెజిల్‌లోని రియో డిజనీరో నగరంలో 1992లో జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సులో సముద్రాలపై అవగాహన పెంచాలని నిర్ణయించారు. చివరకు ఐక్యరాజ్యసమితి 2008, జాన్ 8న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది. సముద్రాలు బాగుండాలి... జీవులూ బాగుండాలి అనేది ఈ ఏడాది అంతర్జాతీయ సముద్ర దినోత్సం థీమ్‌గా ఎంపిక చేశారు. 

అరుదైన అవకాశం
ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి జూన్‌ 8న  కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తోంది. 45 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదికి చెందిన తాడి దీపిక పాల్గొంటున్నారు. గ్రీన్‌వార్మ్స్‌ ప్రాంతీయ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. 

సముద్రం....మరికొన్ని విశేషాలు
- ప్రపంచ జనాభాలో సగం మంది సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నారు. సముద్రం, తీరంలో దొరికే వనరులే వారికి జీవనాధారం.
- భూమిపై ఉన్న జీవంలో 50 నుంచి 80 శాతం సముద్రంలోనే ఉంది.

- సముద్ర జలాల్లో కేవలం 1 శాతం జలాల్లోనే సెక్యూరిటీ ఉంది. మిగిలిన జలాలు రక్షణ లేదు. అందువల్లే టెక్నాలజీ ఇంతగా పెరిగినా సముద్రపు దొంగలు రెచ్చిపోతున్నారు. ఇక అభివృద్ధి చెందిన దేశాలు గుట్టుచప్పుడు కాకుండా సముద్ర జలాల్లో అణు పరీక్షలు నిర్వహిస్తాయనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. 
- సముద్ర జలాల్లో క్రమంగా ఆల్గే నాచు పేరుకుపోతుంది. దీని వల్ల సముద్ర జలాలు కాలుష్యమవుతున్నాయి. దీంతో సముద్ర జీవుల రక్షణ, భద్రత ప్రమాదంలో పడుతోంది. 


- భారీ ఎత్తున కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకోవడం ద్వారా సముద్రాలు పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నాయి. అయితే రోజురోజుకి కార్బన్‌ డై ఆక్సైడ్‌ శాతం పెరిగిపోవడంతో క్రమంగా సముద్ర జలాలు ఆమ్ల లక్షణాలను సంతరించుకుంటున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
- మనం పీల్చే ఆక్సిజన్‌లో 70 శాతం సముద్రం నుంచే వాతావరణంలోకి వెలువడుతుంది.

- పసిఫిక్‌ మహసముద్రంలో 2,600 కిలోమీటర్ల దూరం విస్తరించిన గ్రేట్‌ బారీయర్‌ రీఫ్‌ జీవవైవిధ్యానికి ప్రతీక. చంద్రుడి నుంచి చూసినా ఈ రీఫ్‌ కనిపిస్తుంది.
- నాగరికత మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సముద్రంలో 5 శాతాన్నే మనం ఇప్పటి వరకు శోధించగలిగాం. ఇంకా సముద్రంలో తెలుసుకోవాల్సిన వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. 

- ఇప్పటి వరకు 2,36,878 సముద్ర జీవులను గుర్తించగలిగారు శాస్త్రవేత్తలు. 
- అగ్నిపర్వతాల్లో 90 శాతం సముద్రంలోనే ఉన్నాయి. 
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top