ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ ఎంపీ కన్నుమూత..

World First Openly Transgender Newzealand Mp Dies - Sakshi

వెల్లింగ్టన్‌: ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ ఎంపీగా అరుదైన గుర్తింపు పొందిన న్యూజిలాండ్ మాజీ చట్టసభ ప్రతినిధి జార్జినా బెయెర్(65) కన్నుమూశారు. చాలాకాలంగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. బెయెర్ ఫ్రెండ్ ఒకరు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

న్యూజిలాండ్ నార్త్ ఐలాండ్‌లో మారుమూల గ్రామంలో జన్మించిన బెయెర్ తొలినాళ్లలో సెక్స్‌వర్కర్‌గానూ పనిచేశారు. ఆ తర్వాత నటిగా, డ్రాగ్ క్వీన్‌గా అలరించారు. కార్టర్‌టన్‌కు మేయర్‌గానూ ఎన్నికయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి ట్రాన్స్‌జెండర్‌ కూడా ఈమే కావడం గమనార్హం. 1999లో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు బెయెర్. 2007 వరకు ఎంపీగా కొనసాగారు.

ఎల్‌జీబీటీక్యూ హక్కుల కోసం పోరాడిన న్యాయవాదిగానూ బెయెర్ గుర్తింపుపొందారు. సెక్స్‌వర్కర్లపై వివక్షపైనా గళమెత్తి వాళ్లకు అండగా నిలబడ్డారు. వ్యభిచారం నేరంకాదనే చట్టాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే  స్వలింగసంపర్కుల వివాహ చట్టం రూపకల్పనలోనూ ఈమెదే కీలకపాత్ర.

అయితే 2014లో ఎంపీగా పోటీచేసిన బెయెర్ ఓటమి చవిచూశారు. ఆ తర్వాత ఆమెను అనారోగ్య సమస్యలు వెంటాడాయి. 2017లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కూడా జరిగింది. గతవారం రోజులుగా బెయెర్‌ తన స్నేహితులు, సన్నిహితులతోనే గడపినట్లు తెలుస్తోంది.
చదవండి: ఢిల్లీలోని ఆటో రిక్షాలో యూఎస్‌ సెక్రటరీ

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top