ఆ డాక్టర్‌ వల్లే నాకు లోపం.. కోర్టు సంచలన తీర్పు

A woman won millions by claiming that her mother's doctor allowing her to give birth - Sakshi

Spina bifida won the landmark legal case over her wrongful conception: ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయిత తర్వాత మహిళలు వైద్యం, నెలవారీ చెకప్‌లకు కోసం డాక్టర్లను సంప్రదించి.. సూచనలు, జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే తాజాగా ఓ యువతి తన తల్లి గర్భంతో ఉన్న సమయంలో సరైన సలహాలు ఇవ్వలేదని డాక్టర్‌ను కోర్టుకు లాగింది. 20 ఏళ్ల యువతి ఈవీ టూంబ్స్.. తన తల్లికి తాను లోపంతో జన్మించడానికి డాక్టర్‌ కారణమైందని, సరైన సలహా ఇచ్చిఉంటే తాను జన్మించిన ఉండేదాన్ని కాదని పేర్కొంది.

అయితే ఈవీ టూంబ్స్‌.. స్పైనా బిఫిడా అనే లోపంతో పుట్టారు. వెన్నెముక సరిగా ఏర్పకుండా లోపంతో పుట్టడం. దీంతో ఆమె రోజు మెడికల్‌ ట్యూబ్‌లను అమర్చుకొని వేదన అనుభవిస్తూ ఉన్నారు. ఆమె తన తల్లి ప్రెగ్నెన్సీ సమయంలో సరైన సూచనలు ఇవ్వలేదని డాక్టర్‌ ఫిలిప్ మిచెల్‌ ఆరోపణలు చేసింది. అంతటితో ఆగకుండా తనకు నష్టం పరిహారం చెల్లించాలని కోర్టులో దావా వేసింది. తాను పోషక ఆహారం తీసుకుంటే.. ఫోలిక్ యాసిడ్ తీసుకోవాల్సిన అవసరం లేదని డాక్టర్‌ సలహా ఇచ్చినట్లు ఈవీ తల్లి పేర్కొంది.

లండన్ హైకోర్టు న్యాయమూర్తి రోసలిండ్ కో క్యూసి ఈవీ టూంబ్స్‌ కేసును సమర్థించారు. ఆమె తల్లికి ముందుగానే సరైన సలహా ఇచ్చి ఉంటే ఈవీ టూంబ్స్‌ .. స్పైనా బిఫిడా వెన్నుముక లోపంతో జన్మించి ఉండేది కాదని తీర్పు నిచ్చారు. టూంబ్స్‌ కోరిన విధంగా తగిన నష్ట పరిహారం చెల్లించాలని డాక్టర్‌ను కోర్టు ఆదేశించింది.ఇక ఈవీ టూంబ్స్‌ దివ్యాంగ ‘షో జంపర్‌’గా పలు పోటీల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top