కుక్కపిల్ల కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా

Woman saves puppy strangled by a carpet python - Sakshi

ఒక మహిళ తన కుక్క పిల్లను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టింది. యజమాని కొండచిలువ నోటికి చిక్కిన కుక్కపిల్లని కాపాడిన విడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. డైలీ మైల్‌ ప్రకారం, పదివారల వయసుగల కుక్కపిల్ల 'వాలీ' అదృష్టవసాత్తు కొండచిలువ బారిన పడకుండా తప్పించుకుంది. కొండచిలువ నోటికి చిక్కిన వాలీ బాధతో గట్టిగా అరిచింది. ఆస్ట్రేలియా, క్వీన్‌లాండ్‌లోని సన్‌షైన్‌ కోస్ట్‌కు చెందిన కెల్లీ మోరిస్‌ తన కుక్కపిల్ల అరుపులు వినగానే మేడమీద ఉన్న ఆమె ఏం జరిగిందో చూడటానికి పరుగున వచ్చింది.

కుటుంబ సభ్యులతో ఆమె అక్కడికి చేరుకునే సరికి ఒక కొండచిలువ కుక్కపిల్ల మెడను చుట్టుకొని ఉంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వాలీని కొండచిలువ నుంచి విడదీయగలిగారు. ఈ క్రమంలో కెల్లీకి కూడా గాయాలు అయినప్పటికీ ఆమె బాగానే ఉన్నారని 'సన్‌షైన్‌ స్నేక్‌ క్యాచర్స్‌‌ ఫేస్‌బుక్‌ పేజ్‌' తెలిపింది. (చదవండికేంబ్రిడ్జి విభాగానికి భారతీయ శాస్త్రవేత్త పేరు)

'మేము ఒక భయంకర శబ్ధన్ని విన్నాం. వాలీ ఎక్కడైన పడిపోయిందో, చిక్కుకుపోయిందో అనుకుంటూ వచ్చాం. వస్తున్న సమయంలో ఒక హారర్‌ మూవీ చూస్తున్నట్లుగా అనిపించింది. ఎక్కడ చూసినా వాలీ రక్తం పడి ఉంది. చివరికి తెలిసింది వాడు కొండచిలువకి చిక్కాడు' అని కెల్లీ ఏబీసీ న్యూస్‌లో తెలిపారు. కుక్కుపిల్లని కాపాడిన తరువాత కొండచిలువను ఒక కవర్‌లో ఉంచామని కెల్లీ అన్నారు. తరువాత వాలీని వైద్యంకోసం పశువైద్యశాలకి తీసుకెళ్లామని, తీవ్రంగా గాయపడిన వాలీ ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతుందని, వాలీకి పెయిన్‌ కిల్లర్స్‌ ఇచ్చారని తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top