7 దశాబ్దాల వైరం.. నాటోలో ఉక్రెయిన్‌ చేరితే రష్యాకున్న సమస్య ఏంటి?

What Is Main Reason Behind Russia-Ukraine Crisis Details Inside - Sakshi

రష్యా ఉక్రెయిన్‌ల మధ్య మొదలైన నాటో వివాదం యుద్ధానికి దారి తీసింది. ఓ దశలో రష్యా చర్చలకు సిద్ధమని ప్రకటించడంతో సమస్య పరిష్యారం దిశగా అడుగులు వేస్తోందని అందరూ భావించారు. కానీ ఉక్రెయిన్‌ వివాదంలో రష్యా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో చివరికి ఆ దేశంపై మిలిటరీ ఆపరేషన్‌ను ప్రకటించింది. అసలు రష్యా నాటోలో ఉక్రెయిన్‌ చేరికను రష్యా ఎందుకంత వ్యతిరేకిస్తోంది. దాని వెనుక కారణాలేమిటి!

నాటో ఏమిటి?
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్‌ సహా 12 దేశాలతో సైనిక కూటమి ఏర్పడిందే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో). ఇందులోని ఒప్పందం ప్రకారం.. నాటోలో సభ్య దేశాలుగా ఉ‍న్న ఏ ఒక్క దేశంపైన బయట దేశాలు సాయుధ దాడి జరిపినట్లయితే.. ఆ దేశానికి నాటోలోని మిగిలిన దేశాలన్నీ సహాయం చేయాలి. అయితే దీని ప్రధాన లక్ష్యం.. రెండో ప్రపంచ యుద్ధానంతరం యూరప్‌లో సోవియట్ రష్యా విస్తరణ ముప్పును అడ్డుకోవటమనే చెప్పచ్చు.

రష్యా కూడా నాటో కూటమికి బదులుగా.. 1955లో తూర్పు యూరప్ కమ్యూనిస్టు దేశాలతో వార్సా ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా రష్యా తన సొంత సైనిక కూటమిని ఏర్పాటు చేసుకుంది. 1991లో పలు కారణాలు వల్ల సోవియట్ యూనియన్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో అంతకు ముందు వార్సా ఒప్పందం చేసుకున్నపలు సభ్య దేశాలు నాటోలో చేరాయి. ఈ పరిణామాలతో రక్షణ పరంగా రష్యా కాస్త బలహీనపడినట్లుగా భావించింది. ఇటీవల నాటోలో ఉక్రెయిన్‌ చేరిక ప్రస్తావన రావడంతో ఆ వార్త రష్యాను మరింత కలవరపెడుతోంది.

నాటోలో యుక్రెయిన్‌ చేరితే రష్యాకు వచ్చే సమస్య ఏమిటి?
ఉక్రెయిన్‌కు ఓ వైపు రష్యా, మరో యూనియన్‌ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఇది నాటో సభ్య దేశం కాదు కానీ ‘భాగస్వామ్య దేశం’గా ఉంది. కానీ ఒకవేళ ఉక్రెయిన్‌ నాటో చేరితో తమకు ఎప్పటికైనా ముప్పు ఉంటుందని రష్యా వాదన. అందుకే ఉక్రెయిన్‌ను, మాజీ సోవియట్‌ దేశాలను నాటోలో చేర్చుకోవద్దని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ ప్రధాన డిమాండ్‌. ప్రస్తుతం ఈ డిమాండ్‌ని అమెరికా, నాటో మాత్రం అంగీకరించలేదు. అంతేకాకుండా రష్యాను చుట్టుముట్టటానికి పశ్చిమ శక్తులు నాటో కూటమిని వాడుకుంటున్నాయని పుతిన్ వాదిస్తున్నారు.

తూర్పు యూరప్‌లో నాటో సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని ఆయన కోరుతున్నారు. ఇదిలా ఉండగా మరో వైపు ఉక్రెయిన్‌ మాత్రం నాటోలో చేరేందుకు రెడీగా ఉంది. నాటో నుంచి రష్యాకు ప్రమాదం ఉందని భావిస్తున్న పుతిన్‌, తాజాగా ఉక్రెయిన్‌ నాటోలో చేరితే పశ్చిమ శక్తులు నుంచి దేశానికి ముప్పు మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. అందుకు యుద్ధానికి పుతిన్‌ తెర లేపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top