Watch J&K CM Farooq Abdullah Dances With Punjab CM At Captain Amarinder Singh Grand Daughter's Wedding - Sakshi
Sakshi News home page

పెళ్లిలో జోష్‌గా స్టెప్పులేసిన కశ్మీర్‌ మాజీ సీఎం..

Mar 5 2021 1:24 PM | Updated on Mar 5 2021 3:18 PM

Watch Video: Farooq Abdullah Dances With Captain Amarinder Singh In Wedding - Sakshi

చంఢీగఢ్‌: రాజకీయాల్లో బిజీగా ఉండే జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూఖ్‌ అబ్దుల్లా తాజాగా ఓ పెళ్లిలో డ్యాన్స్‌ చేస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ మనవరాలి వివాహం ఢిల్లీకి చెందిన బిజినెస్‌మెన్‌ ఆదిత్యానారంగ్‌తో జరిగింది. చండీగఢ్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఫరూఖ్‌ అబ్దుల్లా హాజరయ్యారు. కాగా, ఏనభై ఏళ్ళ వయస్సులోను ఫరూఖ్‌.. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌తో కలిసి స్టేజీ పైన జోష్‌గా స్టెప్పులేశారు.

ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో అమరీందర్ ‌సింగ్‌ పాడుతూంటే దానికి తగ్గట్టుగా అబ్దుల్లా స్టెప్పులు వేసి అక్కడి వారిలో మరింత జోష్‌ను నింపుతున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఈ వయస్సులో కూడా ఇంత ఉత్సాహంగా డ్యాన్స్‌ చేయడాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అయితే .. వీరిద్దరు కలిసి గతంలో మహమ్మద్‌‌ రఫీ పాడిన ‘ఆజ్‌ కల్‌ తేరే మేరే ప్యార్‌ కె చర్చే..’, ‘గులాబీ ఆంఖే జో తెరి దేఖీ..’ అనే పాటల పైన‌ జోష్‌గా స్టెప్పులేశారు.

చదవండి: వైరల్‌: భర్తను కోల్పోయిన టీచర్‌కు స్టూడెంట్‌ ఓదార్పు

Advertisement
 
Advertisement
Advertisement